తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నిశ్చయ్​' వేడుకకు పవన్​.. పూల్​పార్టీలో నిహారిక - అల్లు అర్జున్​ వార్తలు

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ ఉదయ్​పూర్​కు పయనమయ్యారు. తన సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక వివాహానికి హాజరయ్యేందుకు మంగళవారం సాయంత్రం బయల్దేరి వెళ్లారు. ఈ ఫొటోలను నాగబాబు తన ఇన్​స్టాగ్రామ్ ద్వారా షేర్​ చేశారు.

Pawan Kalyan heads to Udaipur for Niharika and Chaitanya's wedding
ఉదయ్​పూర్​కు పయనమైన పవన్​.. పూల్​పార్టీలో నిహారిక

By

Published : Dec 8, 2020, 8:11 PM IST

Updated : Dec 8, 2020, 8:42 PM IST

నిహారిక-చైతన్యల పెళ్లికి హాజరయ్యేందుకు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఉదయ్‌పూర్‌కు బయలుదేరారు. ఆయన గత కొన్ని రోజులుగా పర్యటనలు, నిరసనలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లికి హాజరవుతారా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. కానీ తన తమ్ముడు వస్తున్నాడని తెలుపుతూ నాగబాబు ఇన్​స్టాగ్రామ్​లో ఫొటో షేర్‌ చేశారు.

పవన్​ వచ్చేస్తున్నాడంటూ.. నాగబాబు షేర్​ చేసిన ఇ​న్​స్టాగ్రామ్​ స్టోరీ

మరోవైపు పెళ్లి కూతురు నిహారిక పూల్‌ పార్టీని ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రీ-వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం ఈ పార్టీని నిర్వహించారు. ఈ సందర్భంగా కునాల్‌ రావల్‌ రూపొందించిన లావెండర్‌ గౌనులో నిహారిక తళుక్కుమన్నారు. ఈ పార్టీలో తీసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పూల్​పార్టీకి సిద్ధమైన నిహారిక

వరుణ్‌ తేజ్‌ తన చెల్లెలు నిహారిక పెళ్లి ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాడని అల్లు అర్జున్‌ అన్నారు. 'నా సోదరుడి పట్ల ఎంతో గర్వపడుతున్నా' అని ఫొటో షేర్‌ చేశారు. అంతేకాదు తన సతీమణి స్నేహారెడ్డి సంగీత్‌ పార్టీలో అందంగా కనిపించిందని ఆమె స్టిల్‌ పంచుకున్నారు.

వరుణ్​ తేజ్​ను అభినందిస్తున్న అల్లుఅర్జున్​
అల్లుఅర్జున్ ఇన్​స్టాగ్రామ్​ స్టోరీ
Last Updated : Dec 8, 2020, 8:42 PM IST

ABOUT THE AUTHOR

...view details