తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హరీశ్​-పవన్​ మూవీ పోస్టర్​ కేక - పవన్​కల్యాణ్​ బర్త్​డే

పవర్​స్టార్ పవన్​కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్(harish shankar pawan kalyan new movie) దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనుంది. ఇవాళ(సెప్టెంబరు 2) పవర్​స్టార్​ పవన్​కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పవన్​ లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

gabbarsingh
గబ్బర్​సింగ్​

By

Published : Sep 2, 2021, 4:10 PM IST

Updated : Sep 2, 2021, 4:30 PM IST

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ పుట్టినరోజు (సెప్టెంబరు 2) సందర్భంగా గురువారం ఆయన నటించే సినిమా వరుస అప్డేట్స్​ వస్తున్నాయి. ఈ క్రమంలోనే హరీశ్​ శంకర్​ దర్శకత్వంలో(harish shankar pawan kalyan new movie) తెరకెక్కాల్సిన మూవీ అప్డేట్​ కూడా వచ్చేసింది. ఈ సినిమాలోని పవన్​ లుక్​ను విడుదల చేసింది. ఇందులో పవర్​స్టార్​ బండిమీద కూర్చొని చేతిలో మైక్​ పట్టుకుని ఉన్నారు. అయితే పవన్​ మొహాన్ని పూర్తిగా చూపించలేదు. ఈ పోస్టర్​ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

ఈ సినిమాను కొంతకాలం క్రితమే అధికారికంగా ప్రకటించినా షూటింగ్​ మాత్రం ప్రారంభంకాలేదు. దేవిశ్రీ ప్రసాద్​ సంగీతమందిస్తున్నారు. మైత్రిమూవీ మేకర్స్​ సంస్థ నిర్మిస్తోంది.

ప్రస్తుతం పవన్ చేతిలో 'హరిహర వీరమల్లు'(harihara veeramallu update), 'అయ్యప్పనుమ్ కోషియుమ్​'(భీమ్లానాయక్​) రీమేక్(bheemla nayak title song), సురేందర్​ రెడ్డి దర్శకత్వంలోని(pawan kalyan surender reddy) ఓ సినిమా ఉండటం వల్ల ఈ మూవీ చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది. గతంలో హరీశ్​శంకర్​-పవన్​ కాంబోలో 'గబ్బర్​సింగ్'​ వచ్చిన సూపర్​హిట్​గా నిలిచింది.

ఇవీ చూడండి

Pawankalyan Birthday: 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ఖరారు

'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ కుమ్మేసింది!

పవర్​స్టార్​తో సురేందర్ రెడ్డి సినిమా ఫిక్స్.. జోష్​లో ఫ్యాన్స్

Last Updated : Sep 2, 2021, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details