తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Pawan Kalyan: పవన్ మరో సినిమా షూటింగ్​కు రెడీ - పవన్ కల్యాణ్ న్యూస్

పవన్-హరీశ్ శంకర్ కాంబినేషన్​లోని సినిమా షూటింగ్​ త్వరలో మొదలుకానుంది. ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్న పవర్​స్టార్.. ఈ ప్రాజెక్టును వాటితోనే పట్టాలెక్కించనున్నారు.

Pawan kalyan- harish shankar movie
పవన్ కల్యాణ్

By

Published : Sep 6, 2021, 5:38 PM IST

పవర్​స్టార్ పవన్​కల్యాణ్(pawan kalyan)​ మరో సినిమా షూటింగ్​కు సిద్ధమయ్యారు. హరీశ్​ శంకర్​(pawan kalyan harish shankar movie) దర్శకత్వంలో నటించే చిత్రం షూటింగ్​ కొన్నిరోజుల్లో మొదలుకానుంది. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా వెల్లడించారు.

పవన్-హరీశ్ శంకర్

ఇటీవల పవన్​ పుట్టినరోజు సందర్భంగా ప్రీలుక్​ పోస్టర్​ను కూడా రిలీజ్ చేశారు. అందులో బైక్​పై మైక్​ పట్టుకుని కూర్చుని ఉన్న పవన్​ సగం లుక్​ ఆకట్టుకుంటోంది. 'ఈసారి ఎంటర్​టైన్​మెంట్​ పాటు...' అంటూ ఆ పోస్టర్​లో రాసుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్​ పండగ చేసుకుంటున్నారు.

పవన్-హరీశ్ శంకర్ మూవీ ప్రీలుక్

ఇదే కాకుండా 'భీమ్లా నాయక్'(bheemla nayak), 'హరిహర వీరమల్లు'(harihara veeramallu story) సినిమాల్లో పవన్ నటిస్తున్నారు. ఇవి రెండు చిత్రాలు వచ్చే ఏడాది జనవరి 12, ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నాయి.

భీమ్లా నాయక్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details