పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం 'హరిహర వీరమల్లు'. ఎ.ఎం.రత్నం సమర్పణలో పాన్ ఇండియా చిత్రంగా ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్‌పై పలు వార్తలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పవన్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న ఈ మూవీ టీజర్ విడుదల చేస్తారని సమాచారం,
పవన్ 'వీరమల్లు' టీజర్ విడుదల ఆరోజే! - పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్ డేట్
పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'హరిహర వీరమల్లు'. తాజాగా ఈ సినిమా టీజర్‌పై పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
వీరమల్లు
17వ శతాబ్దం నేపథ్యంగా సాగే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు సగం వరకు పూర్తయిందని సమాచారం. ఆ మధ్య బాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ శ్యామ్ కౌశల్ నేతృత్యంలో పవన్‌పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నారు.