తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వీరమల్లు'లో యుద్ధ సన్నివేశాల కోసం పవన్​ కసరత్తు - pawankalyan veeramallu looks

'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్​కల్యాణ్​కు సంబంధించిన కొన్ని స్టిల్స్​ను పంచుకున్నారు చిత్ర దర్శకుడు క్రిష్​. ఇందులో పవన్​ బల్లెంతో శిక్షణ తీసుకుంటున్నట్లు కనిపించారు. ఇవి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

veeramallu
వీరమల్లు

By

Published : Apr 2, 2021, 3:00 PM IST

దర్శకుడు క్రిష్​-హీరో పవన్​కల్యాణ్​ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'వీరమల్లు'. శరవేగంగా చిత్ర షూటింగ్​ను జరుపుకుంటున్న ఈ సినిమాలో పవన్​కు సంబంధించిన కొన్ని స్టిల్స్​ను అభిమానులతో పంచుకున్నారు క్రిష్​. ఇందులో పవన్​.. యుద్ధ సన్నివేశాల కోసం బల్లెంతో శిక్షణ తీసుకుంటున్నట్లు కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్​​గా మారాయి.

వీరమల్లు కోసం పవన్​కల్యాణ్​
వీరమల్లు కోసం పవన్​కల్యాణ్​

చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ గజదొంగ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ​ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. కీరవాణి సంగీతమందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

వీరమల్లు కోసం పవన్​కల్యాణ్​

ఇదీ చూడండి: పవన్‌ చుట్టూ తెలియని శక్తేదో ఉంది: నిధి అగర్వాల్

ABOUT THE AUTHOR

...view details