గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఓ ఉద్యమంలా సాగుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగమవుతున్నారు. తాజాగా ఈ హరిత సవాల్లో భాగంగా జూబ్లీహిల్స్ ప్రాంగణంలో లక్ష మొక్కలు నాటే భారీ కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పాల్గొని మొక్కలు నాటారు. దర్శకుడు అనిల్ రావిపుడి, బోయపాటి శ్రీను సహా పలువులు సినీ పరిశ్రమకు చెందిన వారు భాగస్వాములయ్యారు. భవిష్యత్తులో మొక్కల ఆవశ్యకత గురించి వీరందరూ వివరించారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన మెగా బ్రదర్స్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ సహా దర్శకులు అనిల్ రావిపుడి, బోయపాటి శ్రీను పాల్గొన్నారు.
మొక్కలు నాటిన మెగా బ్రదర్స్
ఇప్పటికే పలువురు నటీనటులు, దర్శకనిర్మాతలు ఎవరికి వారు పెద్దఎత్తున మొక్కలు నాటుతూ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో భాగం పంచుకుంటున్నారు. ఈ మేరకు భావితరాలకు మెరుగైన వాతావరణం ప్రసాదించడంలో అంతా భాగం కావాలని పిలుపునిస్తున్నారు.
ఇది చూడండి : 'ప్రపంచంలోనే చిత్రపరిశ్రమ ఓ అందమైన మోసం'