పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవలే వైరస్ బారిన పడిన ఆయన తన ఫామ్‌హౌజ్‌లో ఇన్ని రోజులు చికిత్స తీసుకున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి ప్రస్తతం కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ సామాజిక మాధ్యమాల్లో తెలియజేసింది.
కరోనా నుంచి కోలుకున్న పవన్ కల్యాణ్ - pawan kalyan corona
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవల కొవిడ్ బారినపడిన ఆయన ప్రస్తుతం కోలుకున్నారని తెలియజేస్తూ శనివారం జనసేన పార్టీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
![కరోనా నుంచి కోలుకున్న పవన్ కల్యాణ్ Pawan Kalyan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11684584-825-11684584-1620460797775.jpg)
"జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కోలుకున్నారు. వైద్యసేవలు అందించిన డాక్టర్లు మూడు రోజుల కిందట ఆయనకు మరోసారి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆరోగ్యపరంగా ఆయనకు ఇబ్బందులేమీ లేవని వైద్యులు తెలిపారు. తన ఆరోగ్యక్షేమాల కోసం ఆకాంక్షించిన వారందరికీ పవన్‌కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో కొవిడ్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్నందున ప్రతిఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, వైద్య నిపుణులు అందిస్తున్న సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేశారు" అని పేర్కొంది.
తన వ్యక్తిగత సిబ్బందిలో చాలా మంది వైరస్ బారిన పడడం వల్ల ఇటీవల పవన్ కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు.