నటి రేణూ దేశాయ్ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. తను ఓ అందమైన వెబ్ సిరీస్‌కు సంతకం చేసినట్లు ప్రకటించారు. త్వరలో తన ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫొటోషూట్‌లో తీసిన ఓ స్టిల్‌ను షేర్ చేశారు.
"మళ్లీ కెమెరా ముందుకు రావడం చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంది. వచ్చే నెల సిరీస్ షూటింగ్ పూర్తిస్థాయిలో ప్రారంభం కాబోతోంది. ఈ ప్రయాణంలో మీ అందరి ఆశీర్వాదాలు, ప్రేమ నాకు కావాలి. నిజం, న్యాయం కోసం పోరాడే ఓ బలమైన మహిళ కథ ఇది. సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై డీఎస్ రావు, ఎస్.రజనీకాంత్ నిర్మిస్తున్నారు. ఎమ్.ఆర్.కృష్ణ మామిడాల దర్శకుడు. శివేంద్ర డీవోపీగా పనిచేస్తున్నారు" అని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ.. వెబ్ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.