తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కిన్నెర మొగిలయ్యకు పవన్ ఆర్థిక సాయం - కిన్నెర మొగిలయ్యకు పవన్ కల్యాణ్ సాయం

ప్రముఖ వాయిద్యకారుడు కిన్నెర మొగిలయ్యకు ఆర్థిక సాయం ప్రకటించారు పవర్ స్టార్ పవన్​కల్యాణ్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది జనసేన పార్టీ.

Pawan Kalyan
పవన్

By

Published : Sep 4, 2021, 2:13 PM IST

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ప్రముఖ వాయిద్యకారుడు కిన్నెర మొగిలయ్యకు రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 'పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్' ద్వారా ఈ సాయాన్ని విడుదల చేశారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది జనసేన పార్టీ.

నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన మొగులయ్య పన్నెండు మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆఖరితరం కళాకారుడు. తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనను సర్కారు సత్కరించింది. అంతే కాకుండా ఈ వాద్యం ప్రాశస్త్యాన్ని, మొగులయ్య ప్రతిభను భావితరాలకు తెలిసేలా ప్రభుత్వం ఎనిమిదో తరగతిలో ఓ పాఠ్యాంశంగా చేర్చింది. ఈ గుర్తింపుతో మొగులయ్య మనసైతే సంతసించింది కానీ.. కడుపు నిండలేదు. కళాకారుల పింఛను కోసం ఏడాది కిందట దరఖాస్తు చేసుకున్నా మంజూరవలేదు.

ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కల్యాణ్​ 'భీమ్లా నాయక్' చిత్రంలో పాట పాడే అవకాశం కల్పించారు. ఇటీవలే విడుదలైన ఈ పాటలో మొగిలయ్య కూడా మనకు కనిపిస్తారు. ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా స్టార్​గా మారిపోయారీ కిన్నెర కళాకారుడు. ప్రముఖ ఛానెళ్లు కూడా ఆయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు ముందుకొచ్చాయి. ఆ ఇంటర్వ్యూల్లో కూడా ఆయన తన ఆర్థిక స్తోమత గురించి ప్రస్తావించారు. దీంతో ముందుకొచ్చిన పవన్.. మొగిలయ్యకు రూ.2 లక్షల సాయం అందించారు.

ఇవీ చూడండి

ఆదరణ కోల్పోయిన కళ.. భిక్షమెత్తుకుంటున్న కళాకారుడు

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కిన్నెర కళాకారుడికి చేయూత

ABOUT THE AUTHOR

...view details