రాయలసీమకు చెందిన జానపద రచయిత, గాయకుడు పెంచల్ దాస్‌ను పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సత్కరించారు. 'శ్రీకారం' సినిమాలోని 'వస్తానంటివో.. పోతానంటివో..' జానపద గేయాన్ని పెంచల్ దాస్ ఆలపించారు. ఆ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
జానపద గాయకుడికి పవన్ సత్కారం - పెంచల్ దాస్‌ను హీరో పవన్‌కల్యాన్, దర్శకుడు త్రివిక్రమ్ సత్కరించారు
జానపద రచయిత, గాయకుడు పెంచల్ దాస్‌ను హీరో పవన్‌కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ సత్కరించారు. రాయలసీమ ప్రాంత జానపదాలను, అక్కడి మాండలికాన్ని నేటి తరానికి చేరువ చేస్తున్న ఆయన కృషి అభినందనీయమని అన్నారు.
![జానపద గాయకుడికి పవన్ సత్కారం pawankalyan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10940614-1069-10940614-1615304198188.jpg)
పవన్ కల్యాణ్
పెంచల్‌దాస్ హైదరాబాద్‌లో మంగళవారం పవన్‌కల్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్.. రాయలసీమ ప్రాంత జానపదాలను, అక్కడి మాండలికాన్ని నేటి తరానికి చేరువ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కొద్దిసేపు జానపదాలు, మాండలికాలు అనే విషయం చర్చించారు. ఈ చర్చలో ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ కూడా పాల్గొన్నారు. అనంతరం పెంచల్‌దాస్‌ను పవన్‌కల్యాణ్ సత్కరించారు.
ఇదీ చూడండి: 'నేను, పవన్ కల్యాణ్ హిమాలయాలకు వెళ్లాలనుకున్నాం'