తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మొగులయ్యకు రూ.2 లక్షల చెక్కు అందజేసిన పవన్​ - పవన్​కల్యాణ్ భీమ్లా నాయక్

'భీమ్లా నాయక్'లో పాట పాడిన మొగలయ్యకు హీరో పవన్​కల్యాణ్​ రూ.2లక్షల చెక్కు అందజేశారు. తన పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

pawan kalyan mogulayya
పవన్ కల్యాణ్​ మొగులయ్య

By

Published : Sep 5, 2021, 4:46 PM IST

Updated : Sep 5, 2021, 5:24 PM IST

12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేస్తున్న అరుదైన జానపద కళాకారుడు మొగులయ్యకు(mogalaiah pawan) హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌(pawan kalyan age). రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేశారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈమేరకు మొగులయ్యకు చెక్కును అందజేశారు.

పవన్​తో మొగులయ్య

ఇటీవలే మొగులయ్య 'భీమ్లా నాయక్‌'(bheemla nayak) చిత్రంలోని పరిచయ గీతానికి సాకీ ఆలపించడం సహా... ఆ పాటకు తన కిన్నెర స్వరాల్ని అద్దారు. దీనికి చక్కటి స్పందన లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతానికి చెందిన మొగులయ్యకు పవన్‌ తన ట్రస్ట్‌ 'పవన్‌ కల్యాణ్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌' నుంచి రూ.2 లక్షలు అందించారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 5, 2021, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details