తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వకీల్​సాబ్' కోసం ఇంటి నుంచే పని చేస్తున్న పవన్ - Pawan Kalyan work from home

కరోనా ప్రభావంతో ఇంటి నుంచే పనిచేసేందుకు సిద్ధమవుతున్నాడు హీరో పవన్​కల్యాణ్. ఇందుకోసం నిర్మాత దిల్​రాజు.. తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

'వకీల్​సాబ్' కోసం ఇంటి నుంచే పని చేస్తున్న పవన్
హీరో పవన్​కల్యాణ్

By

Published : Mar 27, 2020, 6:46 AM IST

పవర్​స్టార్ పవన్​కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా 'వకీల్​సాబ్'. కరోనా ప్రభావం ఉండకపోయింటే చిత్రీకరణ పూర్తయి, మేలో ప్రేక్షకుల ముందుకొచ్చేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల చిత్ర విడుదల ఆలస్యమవనుంది. ఇలాంటి సమయంలో చిత్రబృందం, నిర్మాణనంతర కార్యక్రమాలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా హీరో పవన్​ కల్యాణ్​ 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేయనున్నాడు.

వకీల్​సాబ్ సినిమాలో పవర్​స్టార్ పవన్​కల్యాణ్

ఈ సినిమాలోని తన పాత్రకు ఇంటినుంచే డబ్బింగ్ చెప్పాలని భావిస్తున్నాడు పవన్. అందుకు తగ్గ ఏర్పాటు అన్ని చేస్తున్నారు నిర్మాత దిల్​రాజు. త్వరలో ఈ పనులు ప్రారంభం కానున్నాయి.

బాలీవుడ్​ హిట్ 'పింక్' రీమేక్​గా ఈ సినిమా తీస్తున్నారు. ఇందులో పవన్​ న్యాయవాదిగా కనిపించనుండగా.. అంజలి, నివేదా థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుతో పాటే క్రిష్ దర్శకత్వంలోనూ నటిస్తున్నాడు పవన్. దీని తర్వాత హరీశ్ శంకర్​తో కలిసి పనిచేయనున్నాడు.

ABOUT THE AUTHOR

...view details