తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఈ అవార్డుకు రజనీ అన్ని విధాలా అర్హులు' - రజనీకాంత్​ వార్తలు

దాదాసాహెబ్​ ఫాల్కే పురస్కారానికి సూపర్​స్టార్​ రజనీకాంత్​ ఎంపికవ్వడం పట్ల పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డుకు రజనీకాంత్​ అన్ని విధాలా అర్హులని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రజనీకాంత్​కు పవన్​ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భవిష్యత్​లో మరిన్ని చిత్రాలతో అలరించాలని ఆకాంక్షించారు.

Pawan Kalyan congratulate Rajinikanth
'ఈ అవార్డుకు రజనీ అన్ని విధాలా అర్హులు'

By

Published : Apr 1, 2021, 7:30 PM IST

చిత్రసీమలో ప్రతిష్టాత్మక పురస్కారమైన దాదాసాహెబ్​ ఫాల్కే అవార్డు సూపర్​స్టార్​ రజనీకాంత్​ను వరించడంపై టాలీవుడ్​ అగ్రకథానాయకుడు పవన్​కల్యాణ్​ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న సూపర్​స్టార్​ రజనీకాంత్​ ఈ పురస్కారానికి అర్హులని ఆయన అన్నారు.

"విలక్షణ నటుడు శ్రీ రజనీకాంత్​ గారు దాదాసాహెబ్​ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన విషయం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తమిళ ప్రేక్షకులను గత నాలుగున్నర దశాబ్దాలుగా మెప్పిస్తున్న శ్రీ రజనీకాంత్​ గారు ఈ పురస్కారానికి అన్ని విధాలా అర్హులు. తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్నీ దక్కించుకున్నారు. మా కుటుంబానికి ఆయన ఎంతో సన్నిహితులు. దాదాపు 30 ఏళ్ల కిందట అన్నయ్య చిరంజీవి గారితో కలిసి ఆయన నటించిన 'బందిపోటు సింహం', 'కాళీ' అనే చిత్రాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. శ్రీ రజనీకాంత్​ గారు మరిన్ని మంచి చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తున్నాను".

- పవన్​ కల్యాణ్​, కథానాయకుడు

51వ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీతగా తమిళ సూపర్​స్టార్​ రజనీకాంత్​ను కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. సినీ రంగంలో అత్యున్నత పురస్కారం రావడం పట్ల రజనీ కుటుంబసభ్యులు, అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:రజనీకాంత్​కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

ABOUT THE AUTHOR

...view details