తెలంగాణ

telangana

ETV Bharat / sitara

49వ వసంతంలోకి టాలీవుడ్​ 'పవర్​'స్టార్​

నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు.. ఇలా విభిన్న విభాగాల్లో ప్రతిభావంతుడైన పవన్ కల్యాణ్.. 49వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.

హీరో పవన్​ కల్యాణ్

By

Published : Sep 2, 2019, 5:11 AM IST

Updated : Sep 29, 2019, 3:24 AM IST

స్టార్ అనే పదానికి బలం ఏమిటో.. మాస్ ఇమేజ్​ అంటే ఎలా ఉంటుందో అతడ్ని చూస్తే అర్థమవుతుంది. సినిమా ఫ్లాప్ టాక్​ తెచ్చుకున్నా రూ.80 కోట్ల వసూళ్లు సాధించడం అతడికే చెల్లింది. హీరో అనే పదానికి సరికొత్త నిర్వచనం చెప్పి పవర్​స్టార్​గా సినీ పరిశ్రమలో స్థానం సంపాదించాడు. ఇప్పటికీ అంతే స్థాయిలో ఆదరణ పొందుతున్నాడు. అతడే కొణిదెల పవన్​కల్యాణ్. నేడు (సెప్టెంబరు 2) 49వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.

పవన్​కల్యాణ్ పుట్టినరోజు కామన్​ డీపీ

మెగాస్టార్​ చిరంజీవి తమ్ముడిగా సినీఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రమక్రమంగా సినిమాల్లో ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. అతడ్ని కథానాయకుడిగా ఎంత మంది అభిమానిస్తారో, వ్యక్తిగా అంతకంటే ఎక్కువగా ఆరాధిస్తారు. నిర్మాత, యుద్ధ కళాప్రావీణ్యుడు, దర్శకుడు, రచయితగా, రాజకీయ నాయకుడిగా ఇలా భిన్నరంగాల్లో రాణిస్తూ తనదైన రీతిలో రాణిస్తున్నాడు.

అన్నయ్య చిరంజీవితో పవన్​కల్యాణ్

కుటుంబ నేపథ్యం
కొణిదెల వెంకటరావు, అంజనా దేవి దంపతులకు 1971 సెప్టెంబరు 2న బాపట్లలో జన్మించాడు పవన్‌ కల్యాణ్. ఇతడికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. పెద్దన్నయ్య చిరంజీవి, నటుడు నిర్మాత అయిన నాగేంద్ర బాబు రెండో అన్నయ్య.

నటనా జీవితం
కంప్యూటర్స్‌లో డిప్లొమా చేసిన పవన్​కల్యాణ్... సినిమా అంటే పెద్దగా ఆసక్తి లేకపోయినా అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. స్వతహాగా సిగ్గరి కావడం వల్ల అరంగేట్రం చేసేందుకు చాలా ఆలోచించాడు. కానీ తన వదిన, చిరంజీవి సతీమణి సురేఖ ప్రోద్బలంతో కథానాయకుడిగా మారాడు.

తమ్ముడు సినిమాలో పవన్​కల్యాణ్​ హావభావాలు

1996లో విడుదలైన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' పవన్‌ తొలి చిత్రం. ఆ సినిమా మోస్తరుగా ఆడినా.. ప్రేక్షకుల ఆదరణ పొందాడు పవన్. అందులో ప్రదర్శించిన యుద్ధవిద్యలు, సాహసోపేతమైన విన్యాసాలు వారికి ఎంతగానో నచ్చాయి. ఆ తర్వాత వచ్చిన 'గోకులంలో సీత', 'తొలి ప్రేమ', 'తమ్ముడు', 'సుస్వాగతం', 'బద్రి', 'ఖుషి' చిత్రాలతో అతడి రేంజ్‌ పెరిగి చెప్పలేనంత ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు.

రికార్డుల రారాజు
'జల్సా', 'గబ్బర్‌ సింగ్‌' చిత్రాలతో సరికొత్త రికార్డులు సృష్టించాడు పవన్​కల్యాణ్. 'అత్తారింటికి దారేది'.. వసూళ్లలో అప్పటి వరకు తెలుగు సినీపరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది.

క్రికెటర్​గా పవన్​కల్యాణ్​

అటు దర్శకత్వం.. ఇటు నిర్మాణం
'జానీ' సినిమాకు దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించాడు. అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకుల్లో పవన్‌ కల్యాణ్‌ ఒకడు. అదే విధంగా పవన్​కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్​ పతాకంపై 'గబ్బర్ సింగ్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాల్ని నిర్మించాడు.

గాయకుడిగా పవన్
'అత్తారింటికి దారేది', 'అజ్ఞాతవాసి' సినిమాల్లో పూర్తిస్థాయిలో గాయకుడిగా మారి పాటల్ని ఆలపించాడు పవన్. తన చిత్రాలలో కనీసం ఒక్క జానపద గీతమైనా ఉండేలా ప్రయత్నాలు చేస్తుంటాడు ఈ కథానాయకుడు.

అజ్ఞాతవాసి సినిమాలో పవన్​కల్యాణ్

రాజకీయాల్లో పవన్​కల్యాణ్
2014 మార్చి 14న జనసేన అనే రాజకీయ పార్టీ స్థాపించాడు​. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. అయినప్పటికీ జనంలో ఉంటూ తన గళాన్ని వినిపిస్తున్నాడు.

రాజకీయ నాయకుడిగా పవన్​కల్యాణ్

'వీడు ఆరడుగుల బుల్లెట్టూ.. ధైర్యం విసిరిన రాకెట్టూ' అనే పాటకి తగ్గట్టుగానే పవన్‌కల్యాణ్‌ ఆలోచనలు ఉంటాయి. ఎవరికీ భయపడకుండా, నిజాయతీగా వేసే అతడి అడుగులు యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.

Last Updated : Sep 29, 2019, 3:24 AM IST

ABOUT THE AUTHOR

...view details