Pawan kalyan Bheemla nayak:పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ 'భీమ్లా నాయక్' రిలీజ్‌కు రెడీ అయింది. ఫిబ్రవరి 25న తెలుగుతో పాటు హిందీలోనూ థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రచారంతో అభిమానుల్ని అలరించేందుకు చిత్రబృందం సిద్ధమైంది.
పవన్ 'భీమ్లా నాయక్' డబ్బింగ్‌ను మంగళవారమే పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ట్రైలర్ పనుల్లో టీమ్ బిజీగా ఉంది. ఫిబ్రవరి 18న ట్రైలర్ విడుదల చేస్తారని, ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారని సమాచారం.