తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సంక్రాంతి రేసు నుంచి 'భీమ్లా నాయక్' ఔట్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే - సంక్రాంతి రేసు నుంచి భీమ్లా నాయక్ ఔట్

పవర్​స్టార్ పవన్​ కల్యాణ్​ 'భీమ్లా నాయక్​' సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకొంది. కొత్త రిలీజ్ డేట్​ను ప్రకటించారు నిర్మాతలు.

Bheemla Nayak new release date
Bheemla Nayak new release date

By

Published : Dec 21, 2021, 10:35 AM IST

Updated : Dec 21, 2021, 11:51 AM IST

పవర్​స్టార్ పవన్ కల్యాణ్, రానా కీలకపాత్రల్లో నటించిన 'భీమ్లా నాయక్' సంక్రాంతి రేసు నుంచి తప్పుకొంది. జనవరి 12న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఫిబ్రవరి 25కి వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్మాతల మండలి అధికారికంగా ప్రకటించింది.

నిర్మాతల సమావేశం

"మూడేళ్ల క్రితమే 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' షూటింగ్ ప్రారంభించుకున్నాయి. చాలా కాలంగా రిలీజ్ డేట్స్ వాయిదా పడుతూ వచ్చాయి. ఈ రెండూ పాన్ ఇండియా సినిమాలే. అందుకే 'భీమ్లా నాయక్' విడుదల తేదీని వాయిదా వేయాలని మాతో పాటు సంక్రాంతికి రిలీజ్ అవబోయే సినిమాల నిర్మాతలు పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, చినబాబు, వంశీని కోరాం. వారు కూడా ఇందుకు ఒప్పుకొన్నందుకు ధన్యవాదాలు. 'భీమ్లా నాయక్​' ఫిబ్రవరి 25న రిలీజ్ కానుంది. అందుకే 'ఎఫ్​ 3' రిలీజ్​ డేట్ ఏప్రిల్ 29కి మార్చాం. ఏప్రిల్ 14న 'కేజీఎఫ్ 2', ఏప్రిల్ 1న 'సర్కారు వారి పాట' విడుదలవుతాయి."

-నిర్మాతల మండలి

కొత్త రిలీజ్ డేట్స్

'ఆర్ఆర్ఆర్' జనవరి 7న, 'రాధేశ్యామ్' జనవరి 14న యథావిధిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక 'భీమ్లా నాయక్' శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25న రానుండగా.. 'ఎఫ్3' ఏప్రిల్ 29న రిలీజ్ కానున్నాయి.

మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియమ్'కు రీమేక్​గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్​ పోలీస్​ అధికారిగా నటిస్తున్నారు. అతడిని ఢీ కొట్టే పాత్రలో రానా కనిపించనున్నారు. నిత్యామేనన్, సంయుక్త.. కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవీ చూడండి: 'మీమర్స్ కంటే అమ్మే ఎక్కువ ట్రోల్ చేస్తుంది'

Last Updated : Dec 21, 2021, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details