తెలంగాణ

telangana

By

Published : Jan 4, 2021, 2:36 PM IST

ETV Bharat / sitara

హరీశ్​ శంకర్​ సినిమాలో ఐబీ అధికారిగా పవన్!

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​, హరీశ్​ శంకర్​ కాంబినేషన్​లో ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో పవన్​ ఇంటెలిజెన్స్​ అధికారిగా తెరపై కనిపించనున్నడని టాలీవుడ్​లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Pawan kalyan as IB officer in 'pspk 28'
'పీఎస్​పీకే 28'లో ఐబీ అధికారిగా పవన్!

'గబ్బర్​ సింగ్' చిత్రంతో సూపర్​హిట్​ అందుకున్న పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​, దర్శకుడు హరీశ్​ శంకర్​ కాంబోలో మరో చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో పవన్​.. ఇంటెలిజెన్స్ (ఐబీ) అధికారి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. క్లైమాక్స్​లో ఆ విషయం రివీల్​ అవుతుందని తెలుస్తోంది. ఇందులో పవన్​ సరసన హీరోయిన్​గా​ పూజా హెగ్డేను పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి.

పవన్​ కల్యాణ్, హరీశ్ శంకర్​ కాంబోలో ఇప్పటికే విడుదలైన 'గబ్బర్​ సింగ్' చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టింది. మరోసారి వీరిద్దరూ కలిసి చేయబోతున్న 'పీఎస్​పీక్ 28'పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

పవన్​ నటిస్తున్న కొత్త సినిమా 'వకీల్​సాబ్​' చిత్రీకరణ ఇటీవలే పూర్తైంది. ఆ తర్వాత క్రిష్​ దర్శకత్వంలో ఓ పీరియాడికల్​ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు హరీశ్​ శంకర్​ చిత్రాన్ని కూడా త్వరలోనే పట్టాలెక్కించనున్నారని తెలుస్తోంది.

ఇదీ చూడండి:'కేజీఎఫ్ 2' టీజర్​ కౌంట్​డౌన్.. ట్రైలర్​తో 'త్రిభంగ'

ABOUT THE AUTHOR

...view details