Pawan new movie: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్.. ఐదు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పవన్ నటించిన 'భీమ్లా నాయక్' ప్రస్తుతం రిలీజ్‌కు రెడీగా ఉంది. 'హరిహర వీరమల్లు' షూటింగ్ ఆల్రెడీ జరుగుతోంది. దీని తర్వాత 'భవదీయుడు భగత్‌సింగ్' చిత్రీకరణ మొదలు కావాల్సి ఉంది.
ఇవే కాకుండా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలోనూ పవన్ ఓ సినిమా చేయాల్సి ఉంది. మరోవైపు 'వినోదయం సితమ్' తెలుగు రీమేక్‌లోనూ పవన్-సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తారని వార్తలు వస్తున్నాయి.