అగ్రకథానాయకుడు పవన్‌కల్యాణ్ సినిమాల విషయంలో జోరు పెంచారు. దాదాపు మూడేళ్ల తర్వాత 'వకీల్‌సాబ్'తో రీఎంట్రీ ఇస్తున్న ఆయన.. క్రిష్, హరీశ్ శంకర్‌తోపాటు సాగర్ కె.చంద్ర ప్రాజెక్ట్‌లతో రానున్న రోజుల్లో మరింత బిజీగా మారనున్నారు. మరోవైపు అభిమానులు కూడా పవన్ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవన్ నటించనున్న సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్రబృందం సోమవారం అభిమానులతో పంచుకుంది.
పవర్‌స్టార్‌తో రానా.. అప్డేట్ వచ్చేసింది - rana daggubati news
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించబోతున్న కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. ఇందులో పవన్‌తో పాటు మరో ప్రధానపాత్రలో దగ్గుబాటి రానా కూడా నటించనున్నారు. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను సోమవారం చిత్రబృందం వెల్లడించింది.
పవన్ కల్యాణ్, రానా
'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో కీలక పాత్రకు యువ నటుడు రానాను చిత్రబృందం ఎంపిక చేసింది. ఈ పాత్ర కోసం ఇప్పటికే సుదీప్, విజయ్‌సేతుపతి, రానా పేర్లు విస్తృతంగా వినిపించగా, చివరకు ఆ అవకాశం రానాను వరించింది. దీంతో మరో క్రేజీ కాంబోను తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారు.
Last Updated : Dec 21, 2020, 10:37 AM IST