ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్.. టాలీవుడ్లో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేశారట. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. ఇందులో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కీలకపాత్రకు ఎంపిక చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే ఈ కథను బాబాయ్-అబ్బాయ్‌లకు వినిపించినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
బాబాయ్-అబ్బాయ్‌లతో శంకర్ భారీ మల్టీస్టారర్! - పవన్ కల్యాణ్ వార్తలు
టాలీవుడ్లో భారీ మల్టీస్టారర్ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కోలీవుడ్ దర్శకుడు శంకర్ దీనికి దర్శకత్వం వహించనున్నరని సమాచారం. ఇందులో రామ్‌చరణ్, పవన్ కల్యాణ్ కలిసి నటించనున్నారని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
దర్శకుడు శంకర్.. ఈ సారి గ్రాఫిక్స్‌ను పక్కనపెట్టి సోషల్ డ్రామా నేపథ్యంలో చెర్రీ-పవన్‌లతో ఈ భారీ మల్టీస్టారర్ రూపొందిస్తున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారని తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. రామ్‌చరణ్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణలో బిజీగా ఉండగా.. పవన్ రెండు కొత్త సినిమాల్లో నటిస్తున్నారు. మరోవైపు దర్శకుడు శంకర్ 'భారతీయుడు 2' రూపొందించే పనిలో ఉన్నారు.
ఇదీ చూడండి:ప్రభాస్ 'ఆదిపురుష్' షూటింగ్ షురూ