పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అసలు తగ్గట్లేదు. సినిమాల్లోకి ఇటీవలే రీఎంట్రీ ఇచ్చిన ఇతడు.. 'పింక్' రీమేక్, క్రిష్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాకు సంతకం చేసేశాడు. దర్శకుడు హరీశ్ శంకర్‌తో మరోసారి పవన్ పనిచేయనున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. పవర్‌స్టార్.. గత 30 రోజుల్లో ప్రకటించిన మూడో సినిమా ఇది కావడం విశేషం.
టాప్ గేర్‌లో పవన్.. 30 రోజుల్లో మూడో సినిమా ప్రకటన - ENTERTAINMENT NEWS
పునరాగమనంలో మూడో సినిమాను ప్రకటించేశాడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు హరీశ్ శంకర్‌తో మరోసారి కలిసి పనిచేయనున్నాడు.

పవన్‌కల్యాణ్-హరీశ్ శంకర్
హరీశ్ శంకర్-పవన్‌కల్యాణ్ కాంబినేషన్లో ఇప్పటికే 'గబ్బర్‌సింగ్' వంటి బ్లాక్‌బస్టర్ వచ్చింది. మరి ఇప్పుడు రాబోయే సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది.
గత మూడేళ్లుగా తమ హీరో వెండితెరపై కనిపించక నిరాశపడిన అభిమానులు.. ఈ ప్రకటనలతో అప్పుడే పండగ చేసుకుంటున్నారు.
Last Updated : Feb 28, 2020, 6:36 PM IST