పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు చెబితే ఆయన అభిమానులకు పూనకాలే. పేరు విన్నా, ఫొటో చూసినా, తెరపై కనిపించినా ఒక్కసారిగా అరుపులు, కేకలతో దద్దరిల్లిపోవాల్సిందే. అలాంటి క్రేజ్ సంపాందించిన పవన్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. జనసేన పార్టీ స్థాపించి పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు. కానీ త్వరలోనే మళ్లీ ముఖానికి రంగేసుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే పవన్ అభిమానులకు పండగే.
ఎన్నికలకు ముందు డీవీవీ దానయ్య, మైత్రీ మూవీస్, రత్నం వంటి నిర్మాణ సంస్థల్లో నటించడానికి అడ్వాన్సులు తీసుకున్నాడు పవన్. 2019 ఎన్నికల హడావుడిలో పడి నటించే సమయం దొరకలేదు. ఇప్పుడీ అడ్వాన్సులను క్లియర్ చేసుకోవాలని భావిస్తున్నాడట పవన్. ఆ నిర్మాణ సంస్థలు కథలు సిద్ధం చేసుకోగానే.. సెట్స్‌లోకి అడుగుపెడతాడని సమాచారం.