ఓ పన్నెండేళ్ల పిల్లాడు తన తొలి నాటకంలోనే 80 ఏళ్ల వృద్ధుడి పాత్ర ధరించి, ప్రశంసలు అందుకున్నాడు. నటనా ప్రస్థానంలో అది అతని తొలి అడుగు. తర్వాత అదే పిల్లాడు ప్రపంచంలోనే గొప్ప నటుడిగా పేరు పొందాడు. తొలి సినిమాకే ఆస్కార్ నామినేషన్ అందుకున్నాడు.
అతడే పాల్‌ముని. "పాత్రలో ఒదిగిపోయాడు" అని చాలా మంది గురించి అలవోకగా రాస్తుంటారు. అయితే ఆ ప్రశంసకు సరిగ్గా అతికినట్టు సరిపోయే గొప్ప నటుడు పాల్‌ముని. "నటన అతడికి వ్యాపకం కాదు.. పిచ్చి" అని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక శ్లాఘించింది.
ఏదైనా పాత్ర ధరించాలంటే దాని మీద పెద్ద పరిశోధనే చేసేవాడు పాల్‌ముని. మేకప్ పరంగా, శరీర భాష పరంగానే కాదు కంఠస్వరాన్నీ పాత్రలకు అనుగుణంగా మార్చుకునేవాడు. ఎక్కువగా ప్రముఖుల బయోపిక్స్‌లో నటించాడు. ఆయా వ్యక్తుల గురించి పుస్తకాలు చదవడం, వారి సంబంధీకుల దగ్గరకు వెళ్లి వివరాలు రాబట్టడం చేసేవాడు. ‘'ద స్టోరీ ఆఫ్ లూయిస్ పాశ్చర్' (1936) చిత్రానికి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్నాడు. అతను నటించిన 'ద లైఫ్ ఆఫ్ ఎమిలే జోలా' చిత్రం 1937 ఆగస్టు 11న విడుదలై ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అందుకుంది. ప్రపంచంలోని గొప్ప చిత్రాల్లో ఒకటిగా పేరు పొందింది.
ఇవీ చూడండి.. ట్రైలర్: 'డ్రీమ్ గర్ల్'గా ఆయుష్మాన్