దేశభక్తి ప్రధానంగా సాగే చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఆగస్టు 15, జనవరి 26 సీజన్లో ఈ చిత్రాలను రిలీజ్ చేస్తే మరింత హైప్ వస్తుంది. దేశంలో సినీ పరిశ్రమ ప్రారంభమైనప్పటి నుంచి ఇలాంటి కథలతో చాలానే చిత్రాలు వచ్చాయి, వస్తున్నాయి. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న వీరులు, వీర జవాన్లు, భారత సైన్యం చేసిన అద్భుత ఆపరేషన్లు ప్రధానంగా చాలా చిత్రాలు వచ్చి ఘనవిజయం సాధించాయి. ప్రస్తుతం ఇదే బాటలో దక్షిణాది నుంచి పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో చూద్దాం.
1947
'గజినీ' ఫేమ్ ఏఆర్ మురుగదాస్ నిర్మిస్తోన్న పాన్ ఇండియా చిత్రం '1947'. పొన్ కుమారన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి ఓం ప్రకాశ్ భట్ మరో నిర్మాత. దేశంలోని ప్రముఖ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.
ఆర్ఆర్ఆర్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలను స్పూర్తిగా తీసుకుని రూపొందిస్తున్న ఫిక్షనల్ సినిమా ఇది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. అక్టోబర్ 13న దేశవ్యాప్తంగా విడుదల కానుంది.
మేజర్
26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తీస్తున్న సినిమా 'మేజర్'. ఈ చిత్రంలో అడివి శేష్.. సందీప్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నిర్మిస్తుండగా.. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు.
వైల్డ్ డాగ్
అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో హైదరాబాద్ బాంబు పేలుళ్ల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'వైల్డ్ డాగ్'. సయామీ ఖేర్, దియా మీర్జా హీరోయిన్లుగా నటించారు. అహిసోర్ సాల్మాన్ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన చిత్రం ఏప్రిల్ 2న విడుదలై ప్రేక్షకుల్ని అలరించింది. ఇందులో నాగార్జున ఎన్‌ఐఏ ఏజెంట్ విజయ్ వర్మగా కనిపించగా సయామీఖేర్ రా ఏజెంట్‌గా నటించింది. అతుల్ కుల్‌కర్ణి, అలీ రెజా, అనీష్ కురువిళ్ల, ప్రకాష్ సుదర్శన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
ఇవీ చూడండి: