తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ట్రైలర్​: మీ భార్యను ప్రేమిస్తున్నారా.. నిజమేనా! - bhumi padnekar movie

బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నటించిన చిత్రం 'పతీ పత్నీ ఔర్ ఓ'. ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్​లో సంచలనం రేపుతోంది. విడుదలై 24 గంటలు కాకముందే దాదాపు 80 లక్షల మంది ఈ ప్రచార చిత్రాన్ని వీక్షించారు.

ట్రైలర్​: భార్యను ప్రేమిస్తున్నారా.. నిజమేనా?

By

Published : Nov 5, 2019, 8:27 AM IST

'ప్యార్ కా పంచ్​నామా', 'సోనూ కే టీటూ కీ స్వీటీ' లాంటి హిందీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తీక్ ఆర్యన్. అతడి తాజా సినిమా 'పతీ పత్నీ ఔర్ ఓ' ట్రైలర్ యూట్యూబ్​లో సంచలనం సృష్టిస్తోంది. విడుదలై 24 గంటలు కూడా కాకముందే దాదాపు 80 లక్షల వీక్షణలతో దూసుకెళ్తోంది.

ఆద్యంతం హాస్యభరితంగా సాగుతోన్న ఈ ప్రచార చిత్రం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. పంచ్ డైలాగ్​లతో కుర్రకారును విశేషంగా ఆకట్టుకుంటోంది. భూమి పెడ్నేకర్, అనన్యా పాండే కథానాయికలుగా నటించారు.

టీ-సిరీస్, బీఆర్ స్టూడియోస్ పతాకంపై భూషణ్​కుమార్, రేణు రవిచోప్రా తదితరులు ఈ సినిమాను నిర్మించారు. ​ముదసార్ అజీజ్ దర్శకత్వం వహించాడు. డిసెంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇదీ చదవండి: దిల్లీ కాలుష్యంపై ప్రియాంక ఆవేదన

ABOUT THE AUTHOR

...view details