తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆది పినిశెట్టి 'పాట్నర్​'గా బొద్దుగుమ్మ హన్సిక - డోరా

సరైనోడు, నిన్నుకోరి, రంగస్థలం చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి, అందాల భామ హన్సిక కలిసి నటిస్తోన్న చిత్రం 'పాట్నర్‌’. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్​లో సినిమా తెరకెక్కుతోంది.

ఆది పినిశెట్టి 'పాట్నర్​'గా బొద్దుగుమ్మ హన్సిక

By

Published : Mar 22, 2019, 11:57 PM IST

Updated : Mar 23, 2019, 12:40 AM IST

ఆది, హన్సిక ప్రధాన పాత్రలో...‘డోరా’ సినిమా సహాయ దర్శకుడు మనోజ్‌ దామోధరన్‌ దర్శకత్వంలో 'పాట్నర్​' చిత్రం తెరకెక్కుతోంది. ఆర్‌ఎఫ్‌సీ క్రియేషన్స్‌ బ్యానర్​పై ఎస్పీ కోహ్లి నిర్మిస్తున్నారు. ఆదికి జోడీగా ‘కుప్పత్తురాజా’ ఫేమ్‌ పాలక్కల్వాణి హీరోయిన్‌గా నటిస్తోంది.

సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. అనంతరం తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రారంభమయింది. సబీర్‌ అహ్మద్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌ దయానిధి సంగీతం సమకూర్చుతున్నారు.

‘హాస్య ప్రధానంగా రూపొందించిన సినిమా ఇది. స్క్రీన్‌ప్లేను సినీజనాలు అభినందిస్తారని నమ్మకం ఉంది. హన్సిక పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఆది కెరీర్‌లోనే ఇది చాలా ముఖ్యమైన సినిమా. ఇది పక్కా ఎనర్జిటిక్, ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది’

--చిత్ర దర్శకుడు, మనోజ్‌ దామోధరన్‌

Last Updated : Mar 23, 2019, 12:40 AM IST

ABOUT THE AUTHOR

...view details