సినిమాలోని పాటల్లో హీరోతో కలిసి సరదాగా ఓ నాలుగు స్టెప్పులు వేయడం, అప్పుడప్పుడూ వచ్చే గ్లామర్ పాత్రలు పోషించడం హీరోయిన్‌లకు కాస్త తేలికైన పని. కాని కొన్ని చిత్రాల్లో సవాళ్లు విసిరే పాత్రలూ వస్తుంటాయి. అలాంటప్పుడే సత్తా చాటాలి. పాత్రకు న్యాయం చేసేందుకు ఎంతటి కష్టానికైనా సిద్ధపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అదే పనిలో ఉంది బాలీవుడ్ నాయిక పరిణీతి చోప్రా.
ఈ అమ్మడు ప్రస్తుతం.. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటిస్తోంది. ఇందులో షట్లర్ పాత్ర కోసం తీవ్ర కసరత్తులు చేస్తోంది పరిణీతి. తాజాగా మరింత తర్ఫీదు కోసం ముంబయిలోని నేవీ రామ్సేత్ థాకుర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో... 15 రోజుల శిక్షణా కార్యక్రమానికి హాజరైంది.
"ఇంటినుంచి ఇక్కడికి రావాలంటే కనీసం నాలుగు గంటలు సమయం వృథా అవుతోంది. అందుకే ఇక్కడే 15 రోజులు ఉండాలని నిర్ణయం తీసుకున్నా. శిక్షణ పొందుతున్న స్టేడియంలోనే చిత్రషూటింగ్ జరుగుతుంది"