తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సైనా బయోపిక్​ విడుదల ఖరారు.. పరిణీతి డబుల్ ధమాకా! - పరిణీతి చోప్రా సైనా నెహ్వాల్ బయోపిక్

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవితాధారంగా 'సైనా' చిత్రం తెరకెక్కుతోంది. పరిణీతి చోప్రా హీరోయిన్​గా చేస్తోన్న ఈ సినిమా రిలీజ్ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం.

Parineeti Chopra-starrer Saina Nehwal biopic gets release date
సైనా బయోపిక్​ విడుదల ఖరారు..

By

Published : Mar 2, 2021, 2:18 PM IST

ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథతో తెరకెక్కుతోన్న చిత్రం 'సైనా'. అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. పరిణీతి చోప్రా హీరోయిన్​గా నటిస్తోంది. ఈ మూవీని నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించిన చిత్రబృందం చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తామని తెలుపుతూ.. రిలీజ్ డేట్​ను కూడా ప్రకటించింది. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

సైనా బయోపిక్​

ఈ బయోపిక్ కోసం మొదట శ్రద్ధా కపూర్​ను సంప్రదించింది చిత్రబృందం. కానీ అనుకోని కారణాలతో ఆమె తప్పుకోవడం వల్ల పరిణీతిని అదృష్టం వరించింది. ఇటీవల పరిణీతి నటించిన 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్' నెట్​ఫ్లిక్స్​లో విడుదలైంది. ఆమె నటించిన మరో చిత్రం 'సందీప్ ఔర్ పింకీ ఫరార్' మార్చి 19న విడుదల కానుంది. దీంతో వరుసగా రెండు వారాల్లో రెండు చిత్రాలను విడుదల చేస్తూ అభిమానులకు డబుల్ మజా అందించనుంది పరిణీతి.

ABOUT THE AUTHOR

...view details