తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పరిణీతి సెల్ఫీ.. జ్ఞాపకాల్లో ప్రియాంక.. రకుల్‌ మోటివేషన్‌ - priyanka chopra

సినీ తారలు తమకు సంబంధించిన కొత్త విశేషాలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. వీరిలో ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా, రకుల్​ ప్రీత్​ సింగ్​, రణ్​వీర్​ సింగ్​ తదితరులు ఉన్నారు. అవేంటో చూద్దాం.

rakul
రకుల్​

By

Published : Mar 21, 2021, 8:28 PM IST

'మీరు గెలుస్తారు లేదా నేర్చుకుంటారు అంతేకానీ ఎప్పటికీ ఓడిపోరు' అంటూ స్ఫూర్తినిచ్చే విషయాలు చెప్పుకొచ్చింది నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. 'సండే థాట్స్‌' పేరిట ఓ ఫొటోను పంచుకుంటూ ఈ వ్యాఖ్యను జోడించింది.

ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌వీర్‌ సింగ్‌ కొత్త ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో బ్లాక్‌ అండ్‌ బ్లాక్ దుస్తుల్లో స్టైలిష్‌గా కనిపించారాయన.

సెల్ఫీకి పోజిస్తూ సామాజిక మాధ్యమాల్లో సందడి చేసింది కథానాయిక పరిణీతి చోప్రా. 'నన్ను వాళ్లు ఒంటరిగా వదిలేశారు అందుకే ఇలా' అంటూ సరదాగా రాసుకొచ్చింది.

గతంలో నిక్‌ జొనాస్‌తో ఐస్‌లాండ్‌లో చేసిన సందడిని గుర్తుచేసుకున్నారు బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా. 2019లో అక్కడ దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details