తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సైనా నెహ్వాల్​గా పరిణీతి - bollywood

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పాత్రను పరిణీతి పోషించనుంది. తొలుత శ్రద్ధా కపూర్​ను అనుకున్నా బిజీ షెడ్యూల్ వల్ల తప్పుకుంది.

సైనా నెహ్వాల్​గా పరిణీతి

By

Published : Mar 15, 2019, 1:23 PM IST

Updated : Mar 15, 2019, 7:28 PM IST

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయిక మారింది. తొలుత శ్రద్ధాకపూర్​ను ఎంపిక చేసింది చిత్రయూనిట్​. బిజీ షెడ్యూల్ వల్ల శ్రద్ధా తప్పుకుంది. ఆమె స్థానంలో పరిణీతి చోప్రాను హీరోయిన్​గా తీసుకున్నట్లు ప్రకటించారు.

"2020లో సైనా బయోపిక్​ను విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నాం. అందుకే శ్రద్ధాను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నాం. పరిణీతి సినిమాను ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉంది. దేశం గర్వపడే క్రీడాకారుల్లో సైనా ఒకరు. ఈ చిత్రం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం".

-భూషన్ కుమార్, టీ సిరీస్ అధినేత

సైనా బయోపిక్​లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. క్రీడా నేపథ్యం గల సినిమాలో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ప్రపంచ పటంలో భారత్​ను నిలిపిన సైనా పాత్ర కోసం బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకునేందుకుకావాల్సినంత శ్రమిస్తా".

-పరిణీతి చోప్రా, బాలీవుడ్ నటి

ఇప్పటికే టాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'సాహో'లో నటిస్తున్న శ్రద్ధా.. బాలీవుడ్​లో స్టాన్లీ కా డబ్బా, హవా హవాయి సినిమాల్లోనటించడానికి ఒప్పుకుంది.

Last Updated : Mar 15, 2019, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details