తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రియాంక దారిలో ఆమె సోదరి పరిణీతి

సోదరి(కజిన్) ప్రియాంక చోప్రా గర్వపడేలా తాను సినిమాలు చేస్తానని హీరోయిన్ పరిణీతి చోప్రా చెప్పింది. అలానే ఆమెలానే నిర్మాతగా విభిన్నమైన చిత్రాల్ని రూపొందిస్తానని తెలిపింది.

Parineeti Chopra on following Priyanka Chopra's footsteps and venturing into production
ప్రియాంక చోప్రా పరిణీతి చోప్రా

By

Published : May 15, 2021, 9:16 PM IST

ఇటీవల 'సైనా' బయోపిక్​తో వచ్చి, ప్రేక్షకుల్ని అలరించింది పరిణీతి చోప్రా. తన కజిన్ ప్రియాంక చోప్రా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని, ఆమెలానే తను కూడా నిర్మాతగా మారతానని పరిణీతి చెప్పింది. కాకపోతే దానికి కొంత సమయం పడుతుందని తెలిపింది.

'లేడీస్ వర్సెస్ రిక్కీ భల్' సినిమాతో అరంగేట్రం చేసిన పరిణీతి.. ఆ తర్వాత ఇష్క్​జాదే, శుద్ధ్ దేశీ రొమాన్స్ తదితర చిత్రాల్లో నటించి, ఆకట్టుకుంది. ఇటీవల 'సైనా' బయోపిక్​తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ప్రియాంక చోప్రాను ప్రతి విషయంలో అనుసరిస్తానని పరిణీతి తెలిపింది.

"నేను ఎప్పుడూ మీమీ దీదీతో(పరిణీతి, ప్రియాంకను పిలిచే పేరు) మాట్లాడుతూ ఉంటాను. కొన్నిరోజుల క్రితం లండన్​లో ఉన్నప్పుడు ఆమె కూడా నాతో పాటు ఉంది. ఆ సమయంలో, నేను సినిమాల ఎంచుకునే విధానం, పాత్రల ఎంపిక గురించి చెప్పాను. నేను ఇటీవల కాలంలో నటించిన సినిమాలు చూడనప్పటికీ, నన్ను ఎంతో మెచ్చుకుంది. అనంతరం కొన్నిరోజులకు నా సినిమాలు చూసి, నా విషయంలో గర్వపడుతున్నట్లు చెప్పింది. అది నిజంగా నాకు చాలా గొప్ప విషయం. దీదీ నాలో రోజూ స్ఫూర్తి నింపుతూ ఉంటుంది. ఆమె చేసే ప్రతి పనిని చూసి, ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటాను. అలానే నా విషయంలో ఆమె ఎప్పుడూ గర్వపడేలా ఉంటాను" అని పరిణీతి చెప్పింది.

అయితే ప్రియాంక చోప్రాలా నిర్మాత అవుతారా? అన్న ప్రశ్నకు పరిణీతి చోప్రా, అవుననే సమాధానమిచ్చింది. కాకపోతే సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నిర్మాతగా మారతానని తెలిపింది. ప్రస్తుతం ఈమె సందీప్ రెడ్డి వంగా తీస్తున్న 'ఎనిమల్' కథానాయికగా చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details