కరోనా దెబ్బకు చాలామంది కథానాయకలు, నాయికలు.. ఈ ఏడాది ఒక్క సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రాలేకపోయారు. అసలు షూటింగ్లు చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో గడిపేస్తున్నారు. ఈ సమయంలో అందరికంటే ఎక్కువగా దూసుకుపోతున్నది బాలీవుడ్ నటి పరిణీతి చోప్రానే. ఈ ఏడాది ఇప్పటికే 'ది గర్ల్ ఇన్ ది ట్రైన్' అంటూ అలరించింది. 'సందీప్ ఔర్ పింకీ ఫరార్', 'సైనా' చిత్రాలతో థియేటర్లలో అభిమానులను పలకరించింది. ఈ చిన్నది ఇంతటి ఆగలేదు. 'ది గర్ల్ ఇన్ ది ట్రైన్' చిత్ర దర్శకుడు రిభూదాస్ గుప్తా తెరకెక్కిస్తున్న కొత్త సినిమా చిత్రీకరణలోనూ పాల్గొంటోంది. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతోంది. అక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకొని చిత్రీకరణ జరుపుతున్నట్లు ఆ బృందం చెబుతోంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దీనిని నిర్మిస్తోంది.
ఆ అదృష్టం ఇప్పుడు నాకు వచ్చింది: పరిణీతి
కరోనా ప్రభావమున్నా సరే వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తోంది హీరోయిన్ పరిణీతి చోప్రా. తనకు చేతినిండా పని ఉండటం అదృష్టమని భావిస్తున్నట్లు ఈమె తెలిపింది.
పరిణీతి చోప్రా
ఈ సినిమా తర్వాత పరిణీతి... సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'యానిమల్' లో నటించనుంది. "ఎవరికైనా చేతి నిండా పని ఉండటమే అదృష్టం. అది నాకిప్పుడు వచ్చింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నా పని నేను చేసుకుపోతున్నాను" అని పరిణీతి చెప్పుకొచ్చింది.
ఇది చదవండి:ప్రియాంకతో త్వరలో పరిణీతి చోప్రా సినిమా!