భారత సైనికులు, పోలీసులపై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్.. వాళ్లే నిజమైన హీరోలని అన్నారు. సినిమాల్లో నటించే తాము 'ఎంటర్టైనర్స్' మాత్రమేనని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
"మనం నటుల్ని కేవలం 'ఎంటర్టైనర్స్' అని పిలవాలి. ఆర్మీ-పోలీసు వారిని హీరోలు అని అనాలి. లేదంటే నిజమైన హీరోలెవరో వచ్చేతరానికి తెలియకుండా పోతుంది" -పరేశ్ రావల్ ట్వీట్
దీనికి 5 లక్షల మంది నెటిజన్లు లైకులు కొట్టారు. ఇటీవలే చైనాతో జరిగిన సరిహద్దు వివాదంలో 20 మంది భారత జవానులు వీరమరణం చెందారు. ఈ నేపథ్యంలోనే పరేశ్ రావల్ సదరు ట్వీట్ చేశారు.
పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న పరేశ్ రావల్.. ప్రస్తుతం భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇవీ చదవండి: