తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాహో తర్వాత సందిగ్ధంలో ప్రభాస్..! - prabhas

'సాహో' ప్రచార కార్యక్రమాల కారణంగా జిల్ ఫేం రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న సినిమాకు బ్రేక్ తీసుకున్నాడు ప్రభాస్. అయితే ఈ చిత్రం విడుదలై రెండు నెలలైనా... తన తర్వాతి ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కించలేదు డార్లింగ్.

సాహో తర్వాత ఆలోచనలో ప్రభాస్..!

By

Published : Nov 3, 2019, 4:51 PM IST

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'సాహో' అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయేసరికి ఆచితూచి అడుగేస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా సెట్స్​పై ఉండగానే జిల్​ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని మొదలుపెట్టిన డార్లింగ్... ప్రస్తుతం ఆ సినిమాకు బ్రేక్ ఇచ్చాడట. సాహో ఫలితం కారణంగా దర్శకుడు స్క్రిప్ట్​ మళ్లీ సమీక్షించే పనిలో పడ్డాడని సమాచారం.

సాహో తర్వాత ఆలోచనలో ప్రభాస్..!

ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ప్రస్తుతం బడ్జెట్​ను కాస్త కుదించి కథ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. స్క్రిప్టు పనులు తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. నవంబరు చివరి వారంలో సినిమా సెట్స్​పైకి వెళ్లనుందని సమాచారం. ఒకవేళ మళ్లీ మార్పులు చేస్తే వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశమున్నట్లు సినీ వర్గాల సమాచారం.

పీరియాడిక్ ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో... ప్రభాస్​ సరసన పూజా హెగ్డే నటించనుంది. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్​ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండి: పవన్ పారితోషికం 100 కోట్లా..!

ABOUT THE AUTHOR

...view details