తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్ ఓ వైపు.. నాగచైతన్య మరోవైపు - geetha govindam cinema news

దర్శకుడు పరశు​రామ్.. ఒకేసారి ఇద్దరు హీరోలకు కథలు చెప్పాడట. అందులో తొలుత నాగచైతన్యతో సినిమా చేసే అవకాశముందని సమాచారం.

ప్రభాస్ ఓ వైపు.. నాగచైతన్య మరోవైపు

By

Published : Nov 22, 2019, 7:58 AM IST

'గీత గోవిందం'తో రూ.వంద కోట్ల విజయాన్ని అందుకున్న దర్శకుడు పరశురామ్‌. ఆ సినిమా విడుదలై ఏడాది దాటేసినా ఈ డైరక్టర్ నుంచి కొత్త కబుర్లేం వినిపించలేదు. అయితే ఇప్పుడు ఒకేసారి ఇద్దరు హీరోలకు కథలు చెప్పేశాడట. వారిలో ప్రభాస్‌, నాగచైతన్య ఉన్నారు.

పరశురామ్‌ చెప్పిన కథ నాగచైతన్యకు బాగా నచ్చిందట. ప్రభాస్‌ కూడా ఈ దర్శకుడితో సినిమా చేయడానికి సన్నద్ధంగానే ఉన్నాడని తెలుస్తోంది. అయితే ముందుగా చైతూ సినిమానే పట్టాలెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం నాగచైతన్య 'వెంకీ మామ'తో పాటు శేఖర్‌ కమ్ముల చిత్రంలోనూ నటిస్తున్నాడు. వీటి తరవాతే పరశురామ్‌తో సినిమా చేయనున్నాడు.

మరోవైపు ప్రభాస్‌ కోసం చాలా మంది దర్శకులు వేచి చూస్తున్నారు కాబట్టి, అతడితో సినిమా ఎప్పుడన్నది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇది చదవండి: రెబల్​స్టార్-డైలాగ్​ కింగ్​​ ఫన్నీ వీడియో చూశారా..?

ABOUT THE AUTHOR

...view details