సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వ్యవసాయం చేయాలనుకుంటున్నట్లు బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి వెల్లడించాడు. అప్పటి వరకు నటుడిగా తన ప్రేమను, ఆనందాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.
"నాతోపాటు ఇతరుల జీవితాల్లో ప్రేమను తీసుకురావాలన్నది నా కల. సినిమాలకు వీడ్కోలు పలికిన తర్వాత వ్యవసాయం చేయాలని అనుకుంటున్నా".
- పంకజ్ త్రిపాఠి, బాలీవుడ్ నటుడు
ఇటీవలె ఓటీటీలో విడుదలైన 'గుంజన్ సక్సేనా' బయోపిక్‌లో సహాయనటుడి పాత్ర పోషించాడు పంకజ్. ఈ సినిమాలో తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భాగమైన తొలి భారత వైమానిక దళ మహిళా పైలట్ కావడానికి గుంజన్ పడిన తపనను.. వెండితెరపై కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు శరణ్ శర్మ. టైటిల్ రోల్లో జాన్వీ కపూర్ నటించింది.