క్రైమ్, థ్రిల్లర్ యాక్షన్ కథతో రూపొందించిన 'మీర్జాపూర్ 2' వెబ్ సిరీస్.. అక్టోబరు 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ సిరీస్ కోసం, అభిమానులు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెగ ఆనందపడిపోతున్నారు. కరోనా వల్ల ఆలస్యమైంది కానీ లేదంటే ఈపాటికే వచ్చేసేది. ఇందులో ఖాలీన్ భయ్యాగా నటించిన పంకజ్ త్రిపాఠి, ఇప్పుడు సరికొత్త పోస్టర్‌ను పంచుకుని సిరీస్‌పై ఆసక్తిని ఇంకాస్త పెంచారు. అయితే దీనికి ఈసారి తెలుగు డబ్బింగ్ ఉంటుందా లేనిది చిత్రబృందం ఇప్పటివరకు వెల్లడించలేదు. ఇదే విషయమై సోషల్ మీడియాలో పలు జోకులూ పేలుతున్నాయి.
'మీర్జాపూర్ 2' సిరీస్‌కు తెలుగు వెర్షన్ ఉందా లేదా? - Mirzapur 2 munna bhayya
పోస్టర్లతో రెండో సీజన్‌పై ఆసక్తి పెంచుతున్న 'మీర్జాపూర్' బృందం.. తెలుగు వెర్షన్‌పై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. అక్టోబరు 23 నుంచి ఈ సిరీస్ నెటిజన్లకు అందుబాటులో ఉండనుంది.
!['మీర్జాపూర్ 2' సిరీస్‌కు తెలుగు వెర్షన్ ఉందా లేదా? Pankaj Tripathi shares grim poster of Mirzapur 2](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8959073-729-8959073-1601205552647.jpg)
'మీర్జాపూర్ 2' సిరీస్
ఈ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, విక్రాంత్ మస్సీ, శ్వేతా త్రిపాఠి, రాశికా దుగల్, కుల్‌భూషణ్ కర్బందా కీలక పాత్రల్లో నటించారు. రెండో భాగంలో విజయ్ వర్మ, ఇషా తల్వార్, అంజుమ్ శర్మలు సహాయ పాత్రల్లో సందడి చేయనున్నారు. గుర్మీత్ సింగ్, మిహిర్ దేశాయ్‌లు దర్శకత్వం వహించగా, రితేశ్ సిద్వానీ నిర్మిస్తున్నారు.