పవన్ కల్యాణ్, పోసాని కృష్ణమురళి మధ్య వార్ ముదురుతోంది. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో జనసేన కార్యకర్తలు... మంగళవారం రాత్రి పోసాని కృష్ణమురిళీపై ఫిర్యాదు చేశారు. జనసేన ఫిర్యాదును పోలీసులు న్యాయ సలహాకు పంపారు. లీగల్ ఓపీనియన్ తర్వాత నిర్ణయం ఉందని పంజాగుట్ట పోలీసులు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి పోసాని కృష్ణమురళీపై జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ పరువుకు భంగం కలిగేలా మాట్లాడారని ఫిర్యాదు ఇచ్చారు.
అసలేం జరిగిందంటే...
తన కుటుంబంపై అభిమానులతో అనుచిత వ్యాఖ్యలు చేయించిన పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) తెలిపారు. పవన్ కల్యాణ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. అభిమానుల దాడిలో తాను చనిపోతే పవన్ కల్యాణే కారణమని పేర్కొన్న పోసాని... ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడి వెళ్తున్న క్రమంలో పోసానిపై పలువురు పవన్ అభిమానులు దాడికి (Pawan fans attempt to attack on Posani) యత్నించారు.