లగాన్, జోధా అక్బర్ లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన అశుతోష్ గొవారికర్ కొత్త సినిమా 'పానిపట్'. ఈ చిత్ర ట్రైలర్ నేడు విడుదలైంది. సంజయ్ దత్, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కృతిసనన్ ముఖ్య పాత్ర పోషించింది.
మూడో పానిపట్ యుద్ధం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. నవాబ్ అహ్మద్ షా అబ్దాలీగా సంజయ్ దత్ నటించగా.. మరాఠా యోధుడు సదాశివరావ్ భావ్ పాత్రలో అర్జున్ కపూర్ కనిపించనున్నాడు. చారిత్రక నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తుంది.