తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లాక్​డౌన్.. నాకు ఆ విషయాలు నేర్పింది: కాజల్

అత్తవారింట్లో ముద్దుగుమ్మ కాజల్​ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటోందట. అలానే రెండోదశ లాక్​డౌన్ వల్ల తనకు చాలా అంశాల్లో క్లారిటీ వచ్చిందని కూడా తెలిపింది. ఇంతకీ కాజల్ తెలుసుకున్నదేంటి?

kajal agarwal
కాజల్ అగర్వాల్

By

Published : Jul 11, 2021, 5:31 AM IST

గతేడాది పెళ్లి చేసుకున్న హీరోయిన్ కాజల్.. భర్త గౌతమ్​తో కలిసి వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది. మరోవైపు పలు భాషల్లో సినిమాలు చేస్తూ, కెరీర్​లోనూ దుసుకెళ్తోంది. అయితే రెండో దశ లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉన్న ఈ ముద్దుగుమ్మ.. అత్తయ్య దగ్గర నుంచి చాలా కొత్త విషయాలు నేర్చుకుందట. కుట్లు, అల్లికలను నేర్చుకున్న కాజల్.. ప్రతిరోజూ ధ్యానం కూడా ప్రాక్టీసు చేస్తోందట.

అత్తతో కాజల్ అగర్వాల్

అయితే లాక్​డౌన్​ వల్ల తనకు చాలా విషయాలు నేర్చుకున్నానని కాజల్ చెప్పింది. కుటుంబం, రిలేషన్​షిప్, సెల్ఫ్ లవ్​కు ఉన్న ప్రాధాన్యం అర్ధమైందని తెలిపింది.

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, నాగార్జునతో ఓ యాక్షన్ థ్రిల్లర్, హిందీ సినిమా ఉమ, తమిళంలో 'ఘోష్టీ' చిత్రంతో పాటు మరో రెండు సినిమాల్లోనూ కాజల్ నటిస్తోంది.

కాజల్ అగర్వాల్

అయితే ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత కాజల్.. నటనకు గుడ్​బై చెబుతుందనే వార్తలు గతంలో వచ్చాయి. తన భర్త గౌతమ్​ ఎప్పుడు చెబితే అప్పుడే సినిమాలకు వీడ్కోలు పలుకుతానని కాజల్ స్పష్టం చేసింది.

కాజల్ అగర్వాల్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details