ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు శంకర్.. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌తో అన్నియన్(తెలుగులో అపరిచితుడు) హిందీ రీమేక్ తీయనున్నట్లు ఏప్రిల్ 14న ప్రకటించారు. ఇంకా ఈ చిత్రం సెట్స్‌పైకి కూడా వెళ్లలేదు అంతలోనే చిత్రబృందానికి షాక్ తగిలింది.
హిందీ 'అపరిచితుడు'కు ఆదిలోనే షాక్ - శంకర్ రణ్వీర్ అపరిచితుడు హిందీ రీమేక్
'అన్నియన్'(అపరిచితుడు) హిందీ రీమేక్ చేస్తే దర్శకుడు శంకర్ చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ చిత్ర మాతృక నిర్మాత రవిచంద్రన్. ఈ కథ హక్కులు తనే దగ్గరే ఉన్నాయని స్పష్టం చేశారు.
శంకర్ రణ్వీర్
'అన్నియన్' నిర్మాత రవిచంద్రన్.. ఈ కథ తనకు సొంతమంటూ శంకర్‌కు ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఈ కథ రాసిన రచయిత సుజాతా దీనికి సంబంధించిన హక్కులను తనకు అమ్మినట్లు తెలిపారు. తన అనుమతి లేకుండా ఈ రీమేక్‌ను తెరకెక్కించడం చట్టవిరుద్ధమని అన్నారు. త్వరలోనే దీనిపై లీగల్ నోటీసులను పంపిస్తానని చెప్పిన ఆయన.. ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలను తక్షణమే నిలిపివేయాలని శంకర్‌ను హెచ్చరించారు.
ఇదీ చూడండి:'అపరిచితుడు' హిందీ రీమేక్‌కు గ్రీన్‌సిగ్నల్