తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరోయిన్​కు​ ఐదో పెళ్లి.. 12 రోజుల్లోనే విడాకులు - Pamela Anderson divorse

ప్రముఖ హాలీవుడ్​ నటి పమీలా ఆండ్రూసన్​ ఇటీవలే ఐదో పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచింది. అయితే ఆ వివాహం జరిగిన 12 రోజుల్లోనే భర్తకు గుడ్​బై చెప్పేసినట్లు తెలుస్తోంది.

Pamela Anderson and Jon Peters have split up after just 12 days of marriage.
పమీలా ఆండ్రూసన్‌

By

Published : Feb 2, 2020, 9:53 PM IST

Updated : Feb 28, 2020, 10:29 PM IST

'బేవాచ్‌' మాజీ స్టార్‌ పమీలా ఆండ్రూసన్‌ 52 ఏళ్ల వయసులో ఇటీవలే ఐదో వివాహం చేసుకుంది. హాలీవుడ్‌ మొగల్‌గా పేరున్న ప్రముఖ నిర్మాత జాన్‌ పీటర్స్‌ను జనవరి 20న ఆమె పెళ్లాడింది. 74 ఏళ్ల పీటర్స్‌ కేవలం నిర్మాత మాత్రమే కాదు, నటుడు కూడా. వీరిద్దరూ మూడు దశాబ్దాల కిందట తొలిసారి డేటింగ్‌ చేశారు. ఆ తర్వాత విడిపోయి మళ్లీ చాలా రోజుల తర్వాత కలిశారు. అయితే పెళ్లయిన తర్వాత వీరిద్దరి బంధం 12 రోజుల్లోనే పెటాకులైనట్లు సమాచారం.

జాన్​, పమీలా

"జాన్ నన్ను ప్రేమగా తన జీవితంలోకి ఆహ్వానించారు. సంతోషంగా ఉంది. మాకు ఒకరి జీవితం నుంచి మరొకరికి ఏం కావాలో తెలియట్లేదు. అది తెలిసే వరకు విడిగా ఉండాలని ఉంది. ప్రస్తుతానికి పెళ్లి రద్దు చేసుకోవాలని అనుకుంటున్నాం"
-- పమీలా ఆండ్రూసన్‌

పమీలా గతంలో టామ్మీ లీ, కిడ్‌ రాక్, రిక్‌ సాలోమన్‌ అనే నలుగురిని పెళ్లి చేసుకుంది. ఇందులో మొదటి భర్త రాక్​స్టార్​ కాగా.. ఆఖరి భర్త సాకర్​ ఆటగాడు.

Last Updated : Feb 28, 2020, 10:29 PM IST

ABOUT THE AUTHOR

...view details