తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'టామ్​ అండ్ జెర్రీ'లో భారతీయ నటికి అవకాశం - Pallavi Sharda

హాలీవుడ్​లో తెరకెక్కుతోన్న 'టామ్ అండ్ జెర్రీ' లైవ్ యాక్షన్ సినిమాలో నటించే ఛాన్స్​ కొట్టేసింది భారతీయ నటి పల్లవి శ్రద్ధా. 2021 ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

'టామ్​ అండ్ జెర్రీ'లో భారతీయ నటికి అవకాశం

By

Published : Jul 31, 2019, 9:53 PM IST

ప్రపంచవ్యాప్తంగా వయసు భేదం లేకుండా అందరూ ఇష్టపడే కార్టూన్ పాత్రలు 'టామ్ అండ్ జెర్రీ'. ఇప్పుడు ఇదే పేరుతో ఓ సినిమాను తీస్తోంది ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్. ఇందులో నటించే అవకాశం దక్కించుకుంది భారతీయ నటి పల్లవి శ్రద్ధా.

ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన ఈ భారతీయ మూలాలున్న నటి.. 'బేషారామ్','హవాయిజాదా' వంటి బాలీవుడ్​ సినిమాల్లోనూ కనిపించింది.

భారతీయ నటి పల్లవి శ్రద్ధా

'టామ్ అండ్ జెర్రీ'ని లైవ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తోంది వార్నర్ బ్రదర్స్ నిర్మాణ సంస్థ. ఈ చిత్రంలో క్లో గ్రేస్ మోరెట్, మైకేల్ పెనా, కొలిన్ జోస్ట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టిమ్ స్టోరీ దర్శకత్వం వహిస్తున్నాడు. 2021 ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: లేడీ 'అర్జున్‌ రెడ్డి'గా మారిన పాయల్‌ రాజ్​పుత్

ABOUT THE AUTHOR

...view details