పాకిస్థాన్‌లో భారతీయ సినిమాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని మోదీ సర్కార్ రద్దు చేయడమే ఈ నిర్ణయానికి కారణంగా చెప్పింది.
పాక్‌లో ప్రస్తుతం ప్రదర్శితమతున్న భారతీయ సినిమాలనూ నిలిపివేసింది. ఇప్పటి నుంచి కొత్త చిత్రాలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపింది.
పాకిస్థాన్‌లో బాలీవుడ్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. అక్కడి థియేటర్లకు 70 శాతం ఆదాయం భారతీయ సినిమాల ద్వారానే వస్తుంది. బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ నటించిన 'సంజూ', సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' సినిమాలు 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తాచాటాయి.