తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పక్కా కమర్షియల్' టీజర్.. 'ఒక చిన్న ఫ్యామిలీ డ్రామా' ట్రైలర్ - movie news

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. పక్కా కమర్షియల్, ఒక చిన్న ఫ్యామిలీ డ్రామా, చంఢీఘడ్​ కరే ఆషికీ, పుష్పక విమానం, టికూ వెడ్స్ షేరూ, అర్జున ఫాల్గుణ చిత్రాల కొత్త సంగతులు ఇందులో ఉన్నాయి.

movie news
మూవీ న్యూస్

By

Published : Nov 8, 2021, 6:35 PM IST

*గోపీచంద్ 'పక్కా కమర్షియల్' టీజర్(pakka commercial trailer) వచ్చేసింది. యాక్షన్​తో మొదలైన ఈ టీజర్ ఆ తర్వాత హాస్యభరితంగా సాగింది. హీరోహీరోయిన్లుగా గోపీచంద్, రాశీఖన్నా.. ఇందులో లాయర్లుగా నటించారు. మారుతి దర్శకుడు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామని చిత్రబృందం చెప్పింది.

*సంగీత్ శోభన్, సిమ్రన్ శర్మ జంటగా నటించిన 'ఒక చిన్న ఫ్యామిలీ డ్రామా' ట్రైలర్​ను(oka chinna family story movie release date) కింగ్ నాగార్జున విడుదల చేశారు. ఈ వెబ్ ఫిల్మ్.. నవంబరు 19 నుంచి నేరుగా జీ5 ఓటీటీలో అందుబాటులోకి రానుంది. రూ.25 లక్షలు అప్పు చేసిన తండ్రి అకస్మికంగా మరణిస్తే ఆయన కుమారుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే కథతో ఈ సినిమా తీశారు. నిహారిక కొణిదెల నిర్మించగా, మహేశ్​ ఉప్పల దర్శకత్వం వహించారు.

*ఆయుష్మాన్ ఖురానా, వాణీ కపూర్ నటించిన చిత్రం 'చంఢీఘడ్​ కరే ఆషికీ'(chandigarh ki aashiqui trailer). ట్రైలర్​ను సోమవారం రిలీజ్ చేశారు. ఆయుష్మాన్.. బాడీ బిల్డర్​గా, వాణీ.. ట్రాన్స్ ఉమెన్​గా కనిపించనున్నారు. డిసెంబరు 10న థియేటర్లలో సినిమా విడుదల కానుంది.

*బాలీవుడ్​ దిగ్గజ నటి-సింగర్-డ్యాన్సర్ సితారదేవి(sitara devi movies) బయోపిక్​ను ప్రకటించారు. ఆమె 101వ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. త్వరలో నటీనటులతో పాటు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

సితార దేవి

*'పుష్పక విమానం' సినిమాలోని(pushpaka vimanam release date) ఆహా లిరికల్ సాంగ్ సోమవారమే రిలీజైంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నిర్మిస్తున్న 'టికూ వెడ్స్ షేరూ'(tiku weds sheru movie) షూటింగ్ మొదలైంది. శ్రీవిష్ణు.. ఎన్టీఆర్ అభిమానిగా నటిస్తున్న 'అర్జున ఫాల్గుణ' సినిమా టీజర్(arjuna phalguna movie).. మంగళవారం ఉదయం 11:07 గంటలకు విడుదల కానుంది. ఆది సాయికుమార్ నటిస్తున్న కొత్త సినిమాలో మిషా నారంగ్​ను కథానాయికగా ఎంపిక చేశారు.

.
.
.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details