బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను ఐక్యరాజ్యసమితి సహృద్భావ రాయబారిగా తొలగించాలని డిమాండ్ చేసింది పాకిస్థాన్. యునిసెఫ్ అంబాసిడర్‌గా ఉన్న ఆమె... శాంతి స్థాపనకు కృషి చేయడంలో విఫలమైనట్లు పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దుకు మద్దతివ్వడమే కాకుండా పాకిస్థాన్‌పై అణు యుద్ధాన్ని సమర్థిస్తూ ట్వీట్ చేసిందని ప్రియాంకపై ఫిర్యాదు చేసింది పాక్.
ఏమైంది..?
370 రద్దు తర్వాత... అమెరికా లాస్ ఏంజెల్స్‌లో బ్యూటీకాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటి ప్రియాంక చోప్రాకు అనుకోని అనుభవం ఎదురైంది. ఓ పాకిస్థానీ మహిళ.. ప్రియాంక గతంలో చేసిన వివాదాస్పద ట్వీట్‌పై ప్రశ్నించింది. దానికి దీటుగా సమాధానమిచ్చిందీ భామ.
"ఓ పాకిస్థానీ మహిళగా నేను, నా దేశ ప్రజలు ఎప్పుడూ మీకు మద్దతుగా నిలిచాం. ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న మీరు.. పాకిస్థాన్‌పై అణు యుద్ధాన్ని సమర్థిస్తూ ట్వీట్ చేశారు. ఇలా చేయడం సబబేనా? ".
-ప్రియాంకను ప్రశ్నించిన పాకిస్థానీ మహిళ
ఈ వ్యాఖ్యలపై ధీటుగా సమధానమిచ్చింది నటి ప్రియాంక చోప్రా.
"నాకు పాకిస్థాన్‌లో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. కానీ నేను దేశభక్తురాల్ని. నా దేశం అంటే గౌరవం, అభిమానం ఉన్నాయి. అయితే యుద్ధాన్ని ప్రేరేపించటం నా అభిమతం కాదు. నన్ను అభిమానించే వారిని ఏమైనా బాధపెట్టి ఉంటే మన్నించండి".
- ప్రియాంక చోప్రా, భారతీయ నటి
మనం ఒకరికొకరు అవకాశాలను సృష్టించుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పింది ప్రియాంక చోప్రా. మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థానాలను అందుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. తన మార్గంలో వీలైనంత మందికి సహాయపడేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేసింది.
యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్‌గా ప్రియాంక