పాకిస్థాన్‌లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. విమానం జనావాసాల మధ్య కూలిపోవడం వల్ల విమానంలో ఉన్న 99 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పాక్ అధికారులు వెల్లడించారు. ఈ విమాన ప్రమాదంలో పాకిస్థాన్ నటి అయేజా ఖాన్ మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు చక్కర్లు కొట్టాయి.
'విమాన ప్రమాదంలో నేను చనిపోలేదు'
పాకిస్థాన్‌కు చెందిన నటి ఆయేజా ఖాన్ శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిని ఖండిస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు ఆయేజా.
'విమాన ప్రమాదంలో నేను చనిపోలేదు'
అంతేకాదు, ఆమె భర్త కూడా ఈ ప్రమాదంలో కన్నుమూసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తల్ని అయేజా ఖండించారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. దయచేసి అసత్య వార్తలను ప్రచారం చేయొద్దని నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వార్తలను ప్రచారం చేసేవారిని ఆ దేవుడు తప్పక శిక్షిస్తాడని అన్నారు.
ఇదీ చూడండి...'ఆర్ఆర్ఆర్' స్క్రిప్టులో కీలక మార్పులు!