తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'హిట్' కంటే 'పాగల్'​కే అధిక వసూళ్లు! - పాగల్ మూవీపై విశ్వక్​ సేన్ స్పందన

హైదరాబాద్​లో 'పాగల్‌' విజయోత్సవ సభను నిర్వహించారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు చిత్ర యూనిట్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. కరోనా ఉన్నప్పటికీ సినిమాను ఆదరించారని.. తన గత సినిమా కంటే 'పాగల్' 40శాతం అధిక వసూళ్లు సాధించిదని హీరో విశ్వక్‌సేన్ వెల్లడించాడు.

పాగల్
పాగల్

By

Published : Aug 16, 2021, 7:46 PM IST

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో తన సినిమా 'పాగల్'ను విజయవంతం చేసిన ప్రేక్షకులకు యువ కథానాయకుడు విశ్వక్ సేన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. 50 శాతం ప్రేక్షకులతో థియేటర్లలో సినిమా ప్రదర్శన కొనసాగినా తన గత చిత్రం 'హిట్' కంటే 40 శాతం వసూళ్లు అధికంగా సాధించినట్లు విశ్వక్ సేన్ వెల్లడించాడు.

పాగల్ చిత్ర నటీనటులు
పాగల్ విజయోత్సవ సభలో విశ్వక్​ సేన్

హైదరాబాద్​లోని ఓ హోటల్​లో చిత్ర నటీనటులు, నిర్మాత బెక్కం వేణుగోపాల్​తో కలిసి 'పాగల్' చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు విశ్వక్ సేన్ కృతజ్ఞతలు తెలిపాడు. లక్కీ మీడియా పతాకంపై నరేశ్ కుప్పిలి దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో నివేదా విశ్వక్​కు జోడిగా నటించగా మురళీశర్మ కీలక పాత్ర పోషించాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details