తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Padma Awards 2022: షావుకారు జానకి, మొగిలయ్యకు పద్మశ్రీ - భీమ్లా నాయక్​

Padma Awards 2022: కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. సీనియర్ నటి షావుకారు జానకి, ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్, 'భీమ్లా నాయక్​' పాటతో ఖ్యాతి పొందిన దర్శనం మొగిలయ్య సహా పలువురిని పద్మ పురస్కారాలు వరించాయి.

padma awards 2022
పద్మ పురస్కారాలు

By

Published : Jan 25, 2022, 10:23 PM IST

Padma Awards 2022: కళా రంగంలో విశేష సేవలందించిన పలువురు కళాకారులకు పద్మ పురస్కారాలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వీరిలో సీనియర్ నటి షావుకారు జానకి, ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్, వాయిద్య కళాకారుడు దర్శనం మొగిలయ్య ఉన్నారు. కళల రంగంలో మొత్తం 34 మందిని పద్మ పురస్కారాలు వరించాయి.

ప్రభా ఆత్రే

ప్రముఖ సంప్రదాయ గాయని ప్రభా ఆత్రేను పద్మ విభూషణ్​తో సత్కరించనుంది కేంద్రం. ఇక బంగాలీ నటుడు విక్టర్​ బెనర్జీ, సింగర్ గుర్మీత్ బవా, సంప్రదాయ సంగీతకారుడు రషీద్ ఖాన్​ను పద్మ భూషణ్​ వరించింది.

పద్మశ్రీ..

పద్మశ్రీ పొందినవారిలో గాయని సులోచనా చవాన్, దర్శకుడు చంద్రప్రకాశ్ ద్వివేది, కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య, కూచిపూడి డ్యాన్సర్ పద్మజ రెడ్డి, సింగర్​-డైరెక్టర్ రామ్ దయాల్ శర్మ ఉన్నారు.

ఇదీ చూడండి:'ప్రణవాలయ' సాంగ్‌ కోసం సాయిపల్లవి ఎంత కష్టపడిందో చూశారా?

ABOUT THE AUTHOR

...view details