ఈ నెల 23న పుట్టినరోజు జరుపుకోనున్నాడు కథానాయకుడు ప్రభాస్. ఈ సందర్భంగా.. అమెరికా, జపాన్లోని 'డార్లింగ్' అభిమానుల కోసం ఓ తీపి కబురందింది. ప్రభాస్ నటించిన 'సాహో', 'బాహుబలి: ది కంక్లూజన్' సినిమాలు.. అక్కడి థియేటర్లలో మళ్లీ విడుదల కానున్నాయి.
కరోనా వ్యాప్తి దృష్ట్యా.. అమెరికా, జపాన్లలో థియేటర్లు ఇన్నాళ్లూ మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే నిబంధనలను పాటిస్తూ మళ్లీ తెరుస్తున్నారు. 'ప్రభాస్' బర్త్డే నేపథ్యంలో.. అతడి గత రెండు సినిమాలను ఈ వారంతంలో మరోసారి విడుదల చేయాలని నిర్ణయించారు అక్కడి థియేటర్ల యజమానులు.